: బంగ్లాదేశ్ వరల్డ్ కప్ జట్టు ఇదే


న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2015 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ ప్రకటించింది. ముష్రఫ్ మొర్తజా నేతృత్వంలోని 15 మంది సభ్యులుగా గల జట్టులో ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్లు, ఆరుగురు స్పెషలిస్టు బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ఒక వికెట్ కీపర్ ఉన్నారు. గ్రూప్ ఏలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఫిబ్రవరి 17న ఆఫ్ఘనిస్తాన్ తో తొలి మ్యాచ్ లో తలపడనుంది. జట్టు సభ్యుల వివరాలు, ముష్రఫ్ మొర్తజా (కెప్టెన్), షకీబ్ ఉల్ హాసన్ (వైస్ కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, అనాముల్ హక్, మోమినుల్ హాక్, మహ్మదుల్లా రియాజ్, ముష్ఫీకర్ రహీం (వికెట్ కీపర్), నాసీర్ హుస్సేన్, తైజుల్ ఇస్లాం, తస్కీన్ అహ్మద్, అల్ అమీన్ హుస్సేన్, సౌమ్య సర్కార్, సబీర్ రహ్మన్, అరాఫత్ సన్నీ, రూబెల్ హుస్సేన్ లు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News