: ఏపీలో 22 మంది డీఎస్పీలకు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఒకేసారి భారీ ఎత్తున ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. ఒకేసారి 22 మంది డీఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. డీఎస్పీల బదిలీలు భారీ ఎత్తున చేపట్టడంతో పోలీసు శాఖలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.