: సంక్రాంతికి ఆర్టీసీలో అధిక ధరలుండవు: ఆంధ్రప్రదేశ్ మంత్రి శిద్ధా రాఘవరావు


సంక్రాంతికి ప్రత్యేకంగా నడపనున్న ఆర్టీసీ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయమని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించామని అన్నారు. ప్రైవేటు సంస్థలకు కూడా అవే ఆదేశాలు వర్తిస్తాయని ఆయన చెప్పారు. జనవరి 26న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంద కొత్త బస్సులను ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. మొత్తం 1100 బస్సులు అందుబాటులోకి రానున్నాయని, అందులో తొలి విడతగా 400 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన వివరించారు. ఆర్టీసీ బస్సులకు జీపీఎస్ వ్యవస్థను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల రంగు మార్పు విషయంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదని ఆయన హెచ్చరించారు. పల్లెవెలుగు బస్సుల పేరును తెలుగు వెలుగుగా మారుస్తున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News