: ఎస్పీ ఎమ్మెల్యే, అతని సోదరుడికి జీవితఖైదు


ఉత్తరప్రదేశ్‌ లో అధికార సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ నియోజకవర్గ ఎమ్మెల్యే కప్తాన్ సింగ్ రాజ్‌ పుత్ కు స్థానిక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2002 ఏప్రిల్ 20న కిషన్ దుబే అనే వ్యక్తిపై దాడిచేసి హత్య చేసిన ఉదంతంలో రాజ్‌ పుత్, అతని సోదరుడు, మరో 9 మందిపై కేసు నమోదైంది. పదమూడేళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో వారిద్దరూ దోషులని శుక్రవారం నిర్ధారించిన ప్రత్యేక కోర్టు నేడు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా, శుక్రవారమే ఎమ్మెల్యే, అతని సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేకు శిక్ష ఖరారు కావడంతో ఆయన శాసనసభ సభ్యత్వానికి అనర్హుడు కానున్నారు. దీంతో, చర్ఖారీ నియోజకవర్గంలో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News