: ఇదీ 'ఘర్ వాపసీ' అంటే... అసదుద్దీన్ ఒవైసీ కొత్త భాష్యం!


దేశంలో చర్చనీయాంశంగా మారిన 'ఘర్ వాపసీ' (మత పునఃమార్పిడి) అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాస్త వివాదాస్పద రీతిలో స్పందించారు! ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారని, అనంతరం ఇతర మతాల్లోకి వెళతారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఘర్ వాపసీ' నిర్వహించడమంటే వారిని తిరిగి ఇస్లాం మతంలోకి తీసుకురావడమేనని కొత్త భాష్యం చెప్పారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ, "నేనేమీ విమర్శలకు జవాబుగా ఈ మాటలనడంలేదు. ఖురాన్ చెప్పిందే నేను చెబుతున్నాను. నా వ్యాఖ్యలను అంగీకరించే విషయం మీకే వదిలేస్తున్నా" అని పేర్కొన్నారు. "నేనేమీ డబ్బును ఎరచూపడంలేదు. ఓ మతానికి చెందిన వాళ్లు ఈ దేశ పౌరులే కాదని అనలేదు. దేశ ప్రజలందరినీ ఒకే మతం కిందికి తీసుకువస్తామనీ అనలేదు. అనేకత్వమే భారత్ ప్రధాన బలం" అంటూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ అధినాయకత్వానికి చురకలంటించారు.

  • Loading...

More Telugu News