: ఎల్ఈడీ బల్బులను పంచనున్న కేంద్రం... కొత్త పథకాన్ని ప్రారంభించిన మోదీ


విద్యుత్‌ ను మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయడంకన్నా, ఉత్పత్తి చేసిన విద్యుత్ ను పొదుపుగా వాడుకోవడం మేలనే నినాదానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా ఎల్ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. నేడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇకపై ఢిల్లీలోని గృహాలు, వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లనే వినియోగించేలా చూస్తామని తెలిపారు. వీటి వాడకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షించిన వారమవుతామని ప్రధాని పేర్కొన్నారు. 2016 మార్చిలోగా 100 పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ వివరించారు.

  • Loading...

More Telugu News