: పద్మ భూషణ్ కు సైనా పేరు సిఫారసు... డిమాండ్ చేయలేదంటున్న అమ్మడు!
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ భూషణ్ పురస్కారానికి ఎట్టకేలకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు సైనా పేరును ప్రత్యేకంగా సిఫారసు చేసినట్టు క్రీడా శాఖ విలేకరుల సమావేశంలో తెలిపింది. అంతకుముందు, ఈ అవార్డు కోసం బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని క్రీడా శాఖ మంత్రి సోనోవాల్ చెప్పారు. దీనిపై బ్యాడ్మింటన్ సంఘం విభేదించింది. అయితే, ఆమె పేరును అవార్డు కోసం ప్రత్యేకంగా పంపే అవకాశాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, అవార్డు కోసం తాను డిమాండ్ చేయలేదని, తన పేరును ఎందుకు పరిశీలించలేదో తెలుసుకోవాలని మాత్రమే అడిగానని సైనా అంటోంది.