: భారత నెంబర్ వన్ దానకర్ణుడిగా విప్రో అధినేత


దానధర్మాల విషయానికొస్తే, ఎవరైనా భారీగా వితరణ చేస్తే వారిని మహాభారత యోధుడు కర్ణుడితో పోల్చడం తెలిసిందే. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ కూడా ఆ కోవలోకే వస్తారు. ఆయన ఇప్పటిదాకా తన వ్యక్తిగత సంపద నుంచి రూ.12,000 కోట్లకు పైగా నిధులను దానధర్మాల కోసం అందించారట. అది కూడా కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే ఇంత మేర దాతృత్వం ప్రదర్శించడం విశేషం. భారత్ లో భారీస్థాయిలో వితరణ చేసిన వ్యక్తుల్లో అజీమ్ ప్రేమ్ జీనే టాప్ అంటూ చైనాకు చెందని 'ద హరూన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్' పేర్కొంది. ఈ అంశంలో రూపొందించిన జాబితాలో విప్రో అధినేతకు నెంబర్ వన్ ర్యాంకు కేటాయించారు. ఇక, వేదాంత రిసోర్సెస్ సంస్థ అధిపతి అనిల్ అగర్వాల్ రూ.1796 కోట్ల మేర వితరణతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న అనిల్ అగర్వాల్ తో పోల్చితే ప్రేమ్ జీ ఆరు రెట్లు అధికంగా వితరణ చేయడం విశేషం. హెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (రూ.1136 కోట్లు), టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (రూ. 620 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (రూ.603 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News