: ప్రియురాలి కోసం భార్యను అంతమొందించాడు!
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. విలువలు నశించి పోతున్నాయనడానికి నిదర్శనంలా... ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కడతేర్చాడో కిరాతకుడు. హైదరాబాదు శివార్లలోని నార్సింగిలో రెండు నెలల క్రితం భార్యను చంపేసి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై హతురాలి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన తర్వాత శవాన్ని వెలికి తీయనున్నారు.