: ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్యలు భేష్... అమెరికా సర్టిఫికేట్


లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు సంతృప్తికరంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి జాన్ కెర్రీ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో కెర్రీ-లూగర్ బిల్లు కింద పాకిస్తాన్ పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం పొందేందుకు అర్హత సాధించింది. 2009లో చేసుకున్న ఒప్పందం ప్రకారం, అమెరికా సాయాన్ని పొందాలంటే అల్-ఖైదా, తాలిబాన్ తదితరాలను ఎదగనీయకుండా చూడాలి. ఈ బిల్లు కింద 532 మిలియన్ డాలర్లను (సుమారు రూ.3356.10 కోట్లు) పాక్ కు సహాయంగా ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. కాగా, ఈ నెల 15న జాన్ కెర్రీ పాకిస్తాన్ లో పర్యటించనున్న నేపథ్యంలో ధన సహాయానికి అంగీకరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News