: రిక్షా ఎక్కాలంటే రూ.6,756... విదేశీయుల ముందు గంగలో కలుస్తున్న ఇండియా పరువు!
ఒకవైపు 'అతిథి దేవోభవ' అంటూ, భారత్ ను సందర్శించే విదేశీ టూరిస్ట్ లను ఆకర్షించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే, కాసేపు రిక్షా ఎక్కేందుకు రూ.6,756 చెల్లించాలంటూ వెబ్ సైట్లు పరువు తీస్తున్నాయి. ఇండియాను సందర్శించాలని భావిస్తూ, ముందుగా బుక్ చేసుకోవాలని కోరుకునే వారికి టూరిస్ట్ వెబ్ సైట్లు చుక్కలు చూపుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి వచ్చేవారు ఈ మాయలో పడుతున్నారు. పింక్ సిటీగా పేరున్న జైపూర్ లో రిక్షా ఎక్కి వీధుల్లో తిరగాలంటే ఒక వ్యక్తి రూ.6,756, అదే ఏనుగు ఎక్కాలంటే రూ.8,363 చెల్లించాలట. అది కూడా డిస్కౌంట్ తరువాత. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అధికార వెబ్ సైట్ లో హోం పేజెస్ పెట్టుకున్న పలు సైట్ల దందా ఘోరంగా ఉందని తెలుస్తోంది. జైపూర్ లో కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉండే హవా మహల్, ఆల్బర్ట్ హాలు మధ్య రూ.30 కూడా ఉందని రిక్షాకు వేలల్లో వసూలు చేస్తున్న వైనం అధికారుల దృష్టికి వెళ్ళినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.