: శబరి ఎక్ప్‌ప్రెస్‌లో అయ్యప్ప భక్తులపై పాంట్రీ కార్ సిబ్బంది దాడి


అయ్యప్ప దర్శనానికి వెళ్లి శబరిమల నుంచి తిరిగివస్తున్న భక్తులపై పాంట్రీ కార్ సిబ్బంది దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కట్టంగూర్‌కు చెందిన ఓరుగంటి హరిబాబు రైల్లోని క్యాంటిన్‌లో కొనుగోలు చేసిన భోజనం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి పాంట్రీ కార్ సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వాగ్వాదం పెరగడంతో, హరిబాబుపై పాంట్రీ కార్ లో పనిచేస్తున్న బీహార్‌ వాసి రేహాన్‌ గ్యాస్‌ సిలిండర్‌, కత్తితో దాడికి పాల్పడ్డాడు. బోగీల మధ్య ఉండే తలుపులను మూసివేసి హరిబాబును కదలనీయకుండా చేశాడు. రైలు నల్గొండ స్టేషన్‌లో ఆగగానే, తప్పించుకొన్న హరిబాబు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు క్యాంటీన్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News