: 'పీకే' సినిమా చూసి మండిపడిన 'కంప్యూటర్ బాబా'


బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం వసూళ్లను ఏ స్థాయిలో రాబడుతోందో, నిరసనలను కూడా అదే స్థాయిలో చవిచూస్తోంది. ఈ సినిమాపై తక్షణమే నిషేధం విధించాలని హిందుత్వ సంస్థలతో పాటు ముస్లిం మతపెద్దలు కూడా డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. దేశంలోని పలు నగరాల్లో ఆ సినిమా ప్రదర్శితమవుతున్న కొన్ని థియేటర్లను ధ్వంసం చేశారు కూడా. తాజాగా మధ్యప్రదేశ్ లో కొందరు సాధువులు ఈ సినిమాపై మండిపడుతున్నారు. 'కంప్యూటర్ బాబా'గా ప్రసిద్ధుడైన ఓ సీినియర్ సాధువు నేతృత్వంలో 'పీకే' సినిమాను వీక్షించిందా సాధువుల బృందం. ఇండోర్ లోని ట్రెజర్ ఐలాండ్ మాల్ మల్టీప్లెక్స్ లో సినిమాను చూసిన వారు అనంతరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సర్కారు, సెన్సార్ బోర్డు ఈ సిినిమా నిలిపివేతకు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో హింసాత్మక రీతిలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిపై 'కంప్యూటర్ బాబా' మాట్లాడుతూ, హిందువులను ఎగతాళి చేసేందుకు ఈ సినిమాలో తీవ్రంగా ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ సినిమా ద్వారా హిందూ మతాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరతామని చెప్పారు.

  • Loading...

More Telugu News