: గళమెత్తితే కాని గుర్తు రాలేదా: ‘పద్మ’కు సైనా పేరును ప్రతిపాదిస్తామన్న కేంద్రం


ఎప్పటిలానే కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మొద్ద నిద్రలో ఉన్నట్లు నటిస్తోంది. అనుకూలంగా ఉన్న ఆటగాళ్ల విషయంలో ఆగమేఘాలపై నిర్ణయం తీసుకునే ఆ శాఖ, అవసరం లేదనుకున్న వారి పట్ల శీతకన్నేయడం సర్వసాధారణంగా మారింది. ఈ తరహా ఘటనే ఇప్పుడూ పునరావృతమైంది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును పద్మ భూషణ్ అవార్డుకు ప్రతిపాదించిన ఆ శాఖ, అన్ని అర్హతలున్న సైనా నేహ్వాల్ పేరును మాత్రం విస్మరించింది. తీరా ఆ పురస్కారానికి తనకు అర్హత లేదా? అంటూ సైనా గొంతెత్తితే కాని ఆ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నిద్ర మేల్కోలేకపోయారు. సైనా గళమెత్తిన నేపథ్యంలో... ‘‘గడువుకు ఒక్కరోజు ముందుగా సైనా దరఖాస్తు అందింది. దీనిని పరిశీలించి పద్మ భూషణ్ పురస్కారం ఎంపిక కోసం ప్రతిపాదిస్తాం’’ అని సోనోవాల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News