: 'కేసీఆర్ ఖబడ్దార్' అంటూ వెలసిన ఫ్లెక్సీలు... నల్గొండ జిల్లాలో కలకలం
నల్గొండ జిల్లాలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేకెత్తిస్తున్నాయి. 'కేసీఆర్ ఖబడ్దార్' అంటూ ఏకంగా ముఖ్యమంత్రికే హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని, ఫాస్ట్ పథకంపై విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని ఫ్లెక్సీలో డిమాండ్ చేశారు. లేకపోతే 'ఖబడ్దార్' అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఎన్ జీ కాలేజీ, శివాజీ నగర్ వద్ద ఈ బ్యానర్లు వెలిశాయి. రాజకీయ శ్రేణుల్లో ఈ బ్యానర్లపై చర్చ జరుగుతోంది.