: 'జనతా పరివార్'లో జేడీ (యూ) విలీనానికి సర్వం సిద్ధం
దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు స్థాపించిన 'జనతా పరివార్'లో విలీనమయ్యేందుకు జేడీ (యూ) సిద్ధమైంది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు పార్టీ ఆఫీస్ బేరర్లు ఆమోద ముద్ర వేశారు. దాంతో పాటు మరో నాలుగు ప్రాంతీయ పార్టీలు కూడా ఇందులో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. విలీనం చేయాలన్న తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న రాష్ట్రంలోని కేంద్ర స్థాయి కార్యకర్తలతో భారీ సదస్సు నిర్వహించబోతున్నట్టు జేడీ (యూ) అధ్యక్షుడు బాషిస్తా నారాయణ్ సింగ్ వెల్లడించారు. మరోవైపు కొన్ని రోజుల నుంచి బీహార్ లో ఉంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పార్టీని విలీనం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.