: ప్రేమ పంచడం, అందరికీ సహాయం చేయడం ఆయన వద్ద నుంచే నేర్చుకున్నా: ప్రకాష్ రాజ్
సినీ నటుడు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నటుడు, దర్శకనిర్మాత ప్రకాష్ రాజ్ నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రసాద్ తో గల సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకున్నారు. ఆహుతి ప్రసాద్ మరణంతో తానో మంచి మిత్రుడిని కోల్పోయానని చెప్పారు. తాను హైదరాబాద్ మాదాపూర్ లో ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నప్పటి నుంచి కూడా ప్రసాద్ ఇంటి స్థలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. ఆర్నెల్ల క్రితం ప్రసాద్ ను కలసినప్పుడు తనకు తేడాగా అనిపించిందని... ఒంట్లో బాగోలేదా? అని అడగ్గా... బాగానే ఉన్నానంటూ సమాధానం ఇచ్చాడని ప్రకాష్ రాజ్ తెలిపారు. తనను బాధిస్తున్న కేన్సర్ ను తనలోనే దాచుకున్నాడని... ఎవరికీ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పంచడం, అందరికీ సహాయం చేయడంలాంటి గొప్ప విషయాలను ప్రసాద్ నుంచే చేర్చుకున్నానని తెలిపారు.