: నేడు రాజధాని రైతులతో జగన్ భేటీ


నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలోని రైతులతో వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. రైతుల నుంచి భూసమీకరణ ప్రారంభమైన తరువాత జగన్ వారితో చర్చలు జరపనుండటం గమనార్హం. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రైతులు జగన్‌ ను కలవనున్నారని తెలుస్తోంది. భూములు ఇచ్చేందుకు అత్యధిక రైతులు అంగీకరించని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News