: ఏంటో... సినిమా వాళ్లు ఒక్కొక్కరు దూరమవుతున్నారు: చిరంజీవి


ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఏంటో... సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఒక్కొక్కరు దూరమవుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో బాధగా ఉంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో మరణించడం కూడా కలచివేస్తోందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆహుతి ప్రసాద్, గణేష్ పాత్రోలు ఎంతో సేవ చేశారని కొనియాడారు. అకాల మరణం పొందిన వీరిద్దరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News