: తెలుగు సినిమా మాటల రచయిత గణేశ్ పాత్రో కన్నుమూత
తెలుగు సినిమా మాటల రచయిత గణేశ్ పాత్రో కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న గణేశ్ పాత్రో కొద్దిసేపటి క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గణేశ్ పాత్రో నాటక రచయితగా సుప్రసిద్ధులు. పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలకూ గణేశ్ పాత్రో మాటలు రాశారు. మరో చరిత్ర, రుద్రవీణ, మయూరి తదితర సూపర్ హిట్ చిత్రాలతో పాటు ఆమధ్య వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికీ ఆయన మాటలందించారు.