: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్... ఐదుగురు మావోల హతం


ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నేటి ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పెదబయలు సమీపంలోని బెజ్జంకి వద్ద చోటుచేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. ఇటీవల సీఆర్పీఎఫ్ బలగాలపై మావోల దాడి నేపథ్యంలో మావోల ఏరివేత చర్యలు ముమ్మరమయ్యాయి. మావోల వేటలో సీలఆర్పీఎఫ్ బలగాలతో పాటు బీఎస్ఎఫ్ కూడా పాలుపంచుకుంటోంది. నేటి తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలకు మావోలు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. ఇరువర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News