: సీబీఐని బీజేపీ సర్కారు జేబు సంస్థగా మార్చుకుంది: సుప్రీంకోర్టులో దీదీ పిిటిషన్?


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై నాడు, నేడు ఒకటే ఆరోపణలు. అదికార పార్టీ ఆ సంస్థను జేబు సంస్థగా వినియోగించుకుంటోందని నిత్యం విపక్షాల గగ్గోలే. ఆ సంస్థను దుర్వినియోగం చేసే పార్టీలు, ఆరోపణలు గుప్పించే పార్టీలు మారుతాయంతే. తాజాగా శారదా చిట్ ఫండ్ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలకు తెరతీసింది. ఆరోపణలకే పరిమితం కాకుండా ఏకంగా సుప్రీంకోర్టు గడపతొక్కేందుకూ ఆ పార్టీ సిద్ధమవుతోంది. తమ వాదనను బలంగా వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ను రంగంలోకి దించనుంది. పశ్చిమ బెంగాల్ లో ప్రాపకం కోసమే బీజేపీ, శారదా కేసులో తమను ఇరికిస్తోందని తృణమూల్ చీఫ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తాము రాజకీయంగానే కాక న్యాయపరంగానూ పోరు సాగించనున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ చెప్పారు.

  • Loading...

More Telugu News