: బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత


బీజేపీ జాతీయ స్థాయి నేత మురళీధర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటీన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి నుంచి మురళీధర్ రావు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మురళీధర్ రావు అస్వస్థతకు గురయ్యారని తెలియగానే, పలువురు బీజేపీ జాతీయ నేతలు ఫోన్లు చేసి వివరాలు కనుక్కుంటున్నారు.

  • Loading...

More Telugu News