: ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మాలతిరాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నెమ్మదిగా తన కేడర్ ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మహిళా మోర్చా కార్యవర్గాన్ని నియమించింది. మొత్తం 55 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వెల్లడించారు. అధ్యక్షురాలిగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాలతిరాణిని నియమించారు. మహిళామోర్చాను పూర్తి స్థాయిలో నియమించడంతో, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ స్థాయిలో మహిళలను ఆకట్టుకోవడానికి వీలు కలుగుతుందని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది.