: అమిత్ షా నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు: కర్ణాటక సీఎం


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. క్రిమినల్ కేసులను ఎదుర్కుని విచారణాధికారుల కరుణాకటాక్షాలతో బయటపడ్డ అమిత్ షా లాంటి వారి నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సి అవసరం కాంగ్రెస్ కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఆయన బీజేపీ చీఫ్ పై విమర్శలు గుప్పించారు. అవినీతి దాహం నేపథ్యంలో కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ... ఏనాడో నైతికతను కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా సాగుతున్న కాంగ్రెస్ పాలనలో ఒక్క అవినీతి కుంభకోణం కూడా వెలుగు చూడలేదని సిద్ధరామయ్య తెలిపారు. బీజేపీ పాలనలో ఆ పార్టీ సీఎం సహా పలువురు మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైళ్లకూ వెళ్లివచ్చారని గుర్తు చేశారు. అవినీతి పాలనకు పునాదులు వేసిన బీజేపీకి నీతులు చెప్పే అర్హత లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News