: సింపుల్ క్యారెక్టర్...మంచి సినిమా...కొత్త కాన్సెప్ట్: వెంకటేష్
'గోపాల గోపాల' సినిమాలో తనది సింపుల్ క్యారెక్టర్ అని, మంచి సినిమాలో పవన్ కల్యాణ్, తాను కలిసి నటించామని విక్టరీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాదు శిల్పకళావేదికలో జరిగిన 'గోపాల గోపాల' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, కొత్త కాన్సెప్ట్ కనుక ఇద్దరమూ కలిసి నటించామని ఆయన చెప్పారు. ఈ సినిమాలో పని చేసేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకోగానే ఆనందం కలిగిందని ఆయన అన్నారు. తాను, పవన్ ఎప్పట్నుంచో కలిసి చేయాలనుకున్నా ఇప్పటికి కుదిరిందని ఆయన తెలిపారు. తన అభిమానులు విక్టరీ చేస్తారని, పవన్ కల్యాణ్ అభిమానుల పవర్ ను కలిపి, ఈ సంక్రాంతిని పవర్ ఫుల్ విక్టరీ చేయాలని ఆయన సూచించారు.