: వెంకటేష్, పవన్ కల్యాణ్ లను డైరెక్ట్ చేయడంతో శత్రువులు తయారయ్యారు: డైరెక్టర్ డాలీ
విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్లను డైరెక్ట్ చేయడంతో తనకు శత్రువులు పెరిగిపోయారని 'గోపాల గోపాల' సినిమా దర్శకుడు డాలీ పేర్కొన్నారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'గోపాల గోపాల' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తెరమీదే స్టార్ కాదని, తెరవెనుక కూడా స్టార్ అని అన్నారు. వెంకటేష్ తనకు అద్భుతమైన సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా వారితో పాటు కొన్ని అడుగులు వేయగలిగానన్న ఆనందం మిగిలిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆడియో వేడుకకు పాసులివ్వలేదని, ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి సహకరించలేదని ఆరోపిస్తూ తనకు చాలా మంది శత్రువులు తయారయ్యారని, ఆఖరుకు ఇంట్లోనే శత్రువులు తయారయ్యారని ఆయన నవ్వుతూ అన్నారు.