: ఈసారి 'స్వచ్ఛ భారత్'లో పవన్ కల్యాణ్, ఎస్పీబీ, వీవీఎస్ లక్ష్మణ్, జీవీకే


ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్'కు కేంద్ర ప్రభుత్వం మరికొందరు ప్రముఖులను నామినేట్ చేసింది. వీరిలో జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ క్రీడాకారుడు వివీఎస్ లక్ష్మణ్, నటి అమల, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, జీవీకే, మైహోమ్ అధినేత రామేశ్వరరావు, సుద్ధాల అశోక్ తేజ, పుల్లెల గోపీచంద్, శివలాల్ యాదవ్, ఐటీ నుంచి మోహన్ రెడ్డి, చౌదరి నామినేట్ అయ్యారు. ఈ నెల 5న హైదరాబాదులో నిర్వహించనున్న 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని వీరిని నామినేట్ చేయనున్నారు. అందుకోసం ముందుగా వారికి ఫోన్ చేసి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News