: వాటర్ గ్రిడ్ పథకం కేసీఆర్ మానస పుత్రిక: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటర్ గ్రిడ్ పై జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ కు అన్ని శాఖల నుంచి ఒకేసారి అనుమతులు కోరుతున్నామన్నారు. ఈ పథకం కోసం 29 రిజర్వాయర్లను వినియోగించనున్నామన్నారు. కొంత మంది ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ కృష్ణా, గోదావరి నీటిని అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.