: మేకిన్ ఇండియా ఫేస్ బుక్ పేజ్ కి విశేష స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన 'మేకిన్ ఇండియా' నినాదం ఫేస్ బుక్ పేజీకి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రతి మూడు సెకెన్లకు ఒకరు చొప్పున ఆ పేజ్ లో చేరుతున్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి మూడునెలలు పూర్తైంది. ఈ మూడు నెలల కాలంలో ఈ ఫేస్ బుక్ పేజీకి 3 మిలియన్లకు పైగా అభిమానులు చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఇంతటి ఆదరణ లభించడం ఇదే ప్రధమమని ప్రభుత్వం పేర్కొంది.