: రంగులు మార్చుకునే దుస్తులు


కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ పరిజ్ఞానం వచ్చిన తర్వాత.. క్షణానికో వింతను వెండితెరమీద ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉన్నాయి సినిమాలు. ఉదాహరణకు క్షణాల్లో రకరకాల రంగులు మారిపోతూ ఉండే దుస్తులు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇది గ్రాఫిక్స్‌ అనుకుంటాం. అయితే శరీర కదలికల్ని బట్టి ఆకారం, రంగు కూడా మార్చుకునే దుస్తులను కెనడాలోని కాంకార్డియా యూనివర్సిటీ వారు తయారుచేశారు. ప్రొ. జొవానా బెర్జోవ్‌స్కా ఆధ్వర్యంలో తయారైన ఈ ఎలక్ట్రానిక్‌ దుస్తులు మన శరీరంలోని వేడినుంచే.. తమకు అవసరమైన విద్యుత్తును సృష్టించుకుంటాయిట.

దుస్తులకు ఎలక్ట్రాన్లను అనుసంధానించడం కాకుండా వాటితో కలిపి నేత నేయడం అనేది తాజా టెక్నిక్‌. ఈ దారాల్లోనే బోలెడు పాలిమర్‌ పొరలుంటాయిట. ఇవి సాగినప్పుడు ఆకృతి మారుతాయి. వాటి మధ్య చర్చ జరిగి రంగు, ఆకృతి పరంగా రకరకాల మార్పులు కనిపిస్తుంటాయి. మొత్తానికి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ను తలపింపజేసే దుస్తులతో బజార్లోకి వెళితే.. మనం ఇతరుల దృష్టిని ఇట్టే ఆకర్షించేయవచ్చు. అయితే రంగులు మారడంలో భాగంగా.. రంగును కోల్పోకుండా ఉంటాయనే గ్యారంటీ ఆ దుస్తులు కూడా ఇవ్వాలి. లేకుంటే తకరారే!

  • Loading...

More Telugu News