: సల్మాన్! తమిళుల మనోభావాలు దెబ్బతీయొద్దు: తమిళ నేతల ఆందోళన


తమిళుల మనోభావాలు దెబ్బతీయొద్దంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ఎదుట తమిళ నేతలు ఆందోళన నిర్వహించారు. శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు మహీంద రాజపక్స పోటీ చేయనున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షం బలం పుంజుకుంటోంది. దీంతో రాజపక్స కుమారుడు నమల్, సల్మాన్ ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరారు. దీంతో సల్మాన్ అంగీకరించాడు. శ్రీలంకలో తమిళుల మాన, ప్రాణాలతో చెలగాటమాడిన రాజపక్స తరపున ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే, ఏఐఏడీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు చెందిన నేతలు ఆందోళన చేస్తున్నారు. సల్లూ భాయ్ తో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.

  • Loading...

More Telugu News