: ఆహుతి ప్రసాద్ సేవలు చిరస్మరణీయం: ఎంపీ మురళీమోహన్
సినీ నటుడిగానే కాక ‘మా’ ప్రధాన కార్యదర్శిగా ఆహుతి ప్రసాద్ సేవలు మరచిపోలేనివని రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ అన్నారు. ఆహుతి ప్రసాద్ హఠాన్మరణం నేపథ్యంలో మురళీమోహన్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆహుతి ప్రసాద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మురళీమోహన్ చైర్మన్ గా, ఆహుతి ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. నాటి స్మృతులను గుర్తు చేసుకున్న మురళీమోహన్, ఆహుతి ప్రసాద్ సేవలు చిరస్మరణీమయని కీర్తించారు.