: రేపు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు
సినీ నటుడు ఆహుతి ప్రసాద్ భౌతిక కాయానికి రేపు హైదరాబాదులోని ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆహుతి ప్రసాద్ నేటి ఉదయం కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆహుతి ప్రసాద్ హఠాన్మరణంతో తెలుగు చిత్ర సీమ విచారంలో కూరుకుపోయింది. చిత్రసీమలో అడుగుపెట్టిన నాటి నుంచి తనదైన శైలిలో రాణించిన ఆహుతి ప్రసాద్ అశేష ప్రేక్షకాదరణను చూరగొన్నారు.