: ఎయిరిండియా విమానాలకు ఉగ్ర ముప్పు... దేశవ్యాప్తంగా హైఅలర్ట్
ఎయిరిండియా విమానాల్లోకి మానవ బాంబులు ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా, ఇతర ప్రధాన నగరాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ-కాబూల్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసేందుకు యత్నించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రయాణికులను తనిఖీ చేసిన తర్వాత కాని లోపలికి అనుమతించడం లేదు.