: ఏపీలో ఈ-వైద్యం ప్రారంభం... బెజవాడలో తొలి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని


ఏపీ సర్కారు ఈ-వైద్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం విజయవాడ నగరం పటమట పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ-వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారీ వైద్య సేవల్లో సంస్కరణల ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తరించనున్నామని ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల గుప్పిట్లోని ఆధునిక వైద్య సౌకర్యాలను సర్కారీ వైద్యాలయాల్లోనూ అందుబాటులోకి తెచ్చే క్రమంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రానున్న కాలంలో ఆరోగ్య రంగంలో మరిన్ని వినూత్న సేవలను ప్రారంభించనున్నామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News