: స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎస్పీ బాలు: కేంద్రం ప్రతిపాదన
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం దక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనకు అవకాశం దక్కనుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కు ప్రచారకర్తగా వ్యవహరించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆయనకు లేఖ రాసింది. బాలు అంగీకారం తెలపడమే తరువాయి, ఆయనకు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ హోదా దక్కనుంది. ఇప్పటిదాకా పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన సంగతి తెలిసిందే. తాజాగా బాలుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అరుదైన గౌరవం దక్కింది.