: ఒబామా దంపతుల హాలీడే లంచ్ ఖరీదు రూ.64 వేలు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ప్రస్తుతం సెలవు తీసుకుని హవాలీలో విహరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు అత్యంత ఖరీదైన భోజనం చేశారు. ఇందుకోసం వారు అతి ఖరీదైన సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారట. ఇద్దరి భోజనానికి రూ.64 వేలు ఖర్చు చేసిన ఒబామా దంపతులు, సభ్యత్వం కోసం ఏకంగా రూ.3.2 కోట్లు చెల్లించారట. హవాలీలోని విలాసవంతమైన వింటేజ్ కేఫ్ లో భోజనం చేయాలంటే సదరు హోటల్ లో సభ్యత్వం ఉండాల్సిందేనట. హాలీడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ఒబామా దంపతులు ఆ హోటల్లో విందారగించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 5 లక్షల డాలర్ల సభ్యత్వం తీసుకుని హోటల్ లోకి ఎంటరయ్యారు. వివిధ పన్నులతో కలిపి 1,000 డాలర్లను చెల్లించారు. అయితే అధ్యక్షుడి హోదాలో ఉండి అంత ఖరీదైన భోజనం చేయాలా? అన్న విమర్శలపై ఒబామా ఘాటుగానే స్పందించారు. కనీసం సెలవుల్లో ఉన్నా కూడా నాపై అంతగా దృష్టి సారించాలా? అంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.