: ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం... ఒకరి మృతి
విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో ఈ సాయంత్రం ప్రమాదం సంభవించింది. పంచదార బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా... ప్రమాదవశాత్తు బస్తాలు జారి కూలీల మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో మాణిక్యం (55) అనే కూలీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నక్కపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాణిక్యం మృతితో షుగర్ ఫ్యాక్టరీలో విషాదం ఆవరించింది.