: భారత్ కు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాం: పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక


గత మూడు రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్చగా ఉల్లంఘించిన పాకిస్థాన్... తన రెండు నాల్కల ధోరణిని మరోసారి బహిర్గతం చేసింది. గత ఆరు-ఏడు నెలల నుంచి భారత్ తో సత్సంబంధాలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తున్నామని... శాంతిని పునరుద్ధరించేందుకు యత్నించామని... అయినప్పటికీ, భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదని నంగనాచి కబుర్లు చెప్పింది. తాము చెబుతున్నది భారత్ కు అర్థంకాకపోతే, వారికి అర్థమయ్యే భాషలోనే చెబుతామంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఓ రేంజ్ లో హెచ్చరిక జారీ చేశాడు. డిసెంబర్ 31న అంతర్జాతీయ సరిహద్దులో చర్చలకు రమ్మని పిలిచి... ఇద్దరు పాక్ రేంజర్లను భారత దళాలు దారుణంగా చంపేశాయని ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే, పాక్ బలగాలు భారత సరిహద్దులపై కాల్పులు జరిపినప్పుడు... మన బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు పాక్ రేంజర్లు మృతి చెందారు.

  • Loading...

More Telugu News