: గవర్నర్ తో భేటీ అయిన ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు
రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఏపీ, తెలంగాణ విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీష్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఎంసెట్ నిర్వహణ అంశంపై వీరు చర్చిస్తున్నారు. ఎంసెట్ ను తామే నిర్వహించుకుంటామని టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించడంతో... ఇరు రాష్ట్రాల మధ్య వివాదం పెరిగి పెద్దదైంది. దీంతో, ఈ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు గవర్నర్ నరసింహన్ ఇద్దరు మంత్రులను రాజ్ భవన్ కు పిలిపించుకున్నారు. కాసేపట్లో భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.