: తెలంగాణ సిలబస్ కమిటీలో కోదండరామ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ ఏర్పాటయింది. ప్రొఫెసర్ హరగోపాల్ నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి పదవులు వద్దనుకున్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఆయనతో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ లు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. నలుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మినహా మిగిలిన ముగ్గురూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.