: టి.ప్రభుత్వానికి అనుభవం, అవగాహన లేవు... అందుకే నీటి సమస్యలు: దేవినేని ఉమా
నాగార్జునసాగర్, శ్రీశైలం నీరు, దాని వినియోగతపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరించిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీఎస్ ప్రభుత్వానికి అనుభవం తక్కువగా ఉండటం, అవగాహన ఏమాత్రం లేకపోవడం వల్లే నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించేందుకే టీఎస్ మంత్రి హరీష్ రావు ఏది బడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ వినియోగం పేరుతో శ్రీశైలంలోని 49 టీఎంసీల నీటిని అనవసరంగా వాడారని... దాని వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని తాము అప్పుడే చెప్పామని తెలిపారు.