: తెలంగాణలో వడ్డీలేని రుణాలు కొనసాగించాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో వడ్డీలేని రుణాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయానికొచ్చినట్టు మీడియా సమావేశంలో చెప్పారు. ఇక వాయిదాలు సకాలంలో చెల్లించి వడ్డీలేని రుణాలు పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది రూ.485 కోట్ల రుణాలు మంజూరు చేశామని, వాటితో మూడు లక్షల స్వయం సహాయక బృందాలు లబ్ధిపొందనున్నాయని కేటీఆర్ వివరించారు.