: చంద్రబాబుతో భేటీలో ప్రభుత్వ పాలనపై సర్వే వివరాలు వెల్లడించిన లోకేశ్
హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పార్టీ ప్రజాప్రతినిధులతో విడతల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాలనపై చేసిన సర్వే వివరాలను యువనేత నారా లోకేశ్ వెల్లడించారు. రుణమాఫీపై 60 శాతం మంది, ఎన్టీఆర్ భరోసా పట్ల 90 శాతం, 'చంద్రన్న సంక్రాంతి కానుక' పట్ల 85 శాతం మంది, విద్యుత్ సరఫరాపై 85 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని లోకేశ్ తెలిపారు.