: డెబిట్, క్రెడిట్ కార్డులపై తగ్గనున్న చార్జీలు!


నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేలా డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై ప్రస్తుతం అమలులో ఉన్న చార్జీలను తగ్గించాలని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని పూణేలో సమావేశమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులు కేంద్రాన్ని కోరారు. బ్యాంకింగ్ రంగంలో అమలు చేయాల్సిన సంస్కరణలపై వీరు సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా, 2007లో దేశవ్యాప్తంగా 3.2 లక్షల పీఓఎస్ (పాయింట్ అఫ్ సేల్) టెర్మినల్స్ ఉండగా, మార్చ్ 2014 నాటికి వాటి సంఖ్య 10.65 లక్షలకు పెరిగింది. వీటిని వాడుతున్నందుకు వ్యాపారులు కొంత మొత్తాన్ని ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంది. లావాదేవీలపై చార్జీలను తగ్గించిన పక్షంలో మరిన్ని పీఓఎస్ ల ఏర్పాటుకు వీలవుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News