: హిందూ సంప్రదాయంలో జరిగిన అమెరికన్ల పెళ్లి


వారిరువురూ అమెరికన్లే. వధువు తండ్రి మాత్రం ఇల్లెందు వాసి. హిందూ వివాహ సంప్రదాయాన్ని మరువలేక పోయిన ఆ యువతి ఇక్కడే వివాహం చేసుకోవాలని భావించింది. ప్రియురాలి కోరిక మేరకు ఇండియాకు వచ్చి పచ్చని పందిట్లో వేదమంత్రాల మధ్య తాళి కట్టాడు వరుడు. ఈ పెళ్ళికి ఇల్లెందులోని సబ్‌ జైల్‌ బస్తీ వేదికైంది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 35 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి, ఆ దేశానికి చెందిన లిన్‌ ను వివాహమాడాడు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె. ఇండియాకు తిరిగివచ్చి ఇల్లెందులోనే ఉంటున్నాడు. అక్కడే పెరిగిన కుమార్తె జయా లిన్ సుశీల కొలిశెట్టి అమెరికాకు చెందిన పాట్రిక్ బార్కోను ప్రేమించింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నాగేశ్వరరావు సూచన మేరకు సుశీల, పాట్రిక్ లు హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వీరి పెళ్లి వైభవంగా జరిగింది.

  • Loading...

More Telugu News