: ఎల్టీటీఈ ఇప్పటికీ విదేశాల్లో యాక్టివ్ గానే ఉంది: రాజపక్స సోదరుడు


ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) నుంచి ముప్పు ఇంకా తుడిచిపెట్టుకుపోలేదని శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి గోటాభాయ రాజపక్స అన్నారు. ఆ తిరుగుబాటు సంస్థ ఇప్పటికీ విదేశాల్లో చురుకుగానే ఉందని హెచ్చరించారు. తన అన్న మహింద రాజపక్స తరపున ఎన్నికల ప్రచార ర్యాలీలో గోటాభాయ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగిస్తూ, "ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయాడు. కానీ ఆ ప్రమాదం (ఎల్టీటీఈ) అంతరించిపోయిందని ఎవరైనా ఆలోచిస్తారా? అది నిజం కాదు. టైగర్స్ చాలా మంది పారిపోయినప్పటికీ విదేశాల్లో యాక్టివ్ గానే ఉన్నారు" అని పేర్కొన్నారు. అంతేగాక, తీవ్రవాదం రూపంలో ఎల్టీటీఈ నుంచి ప్రమాదం పొంచి ఉందని, 80ల్లోని తీవ్రవాద చీకటి శకం తిరిగి దేశంలో చెలరేగే అవకాశం ఉందన్నారు. కాబట్టి దేశ భధ్రత కొనసాగించేందుకు తాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అధికారం కావాలని కోరుకుంటూ తమిళ ఆధిపత్యం ఉన్న ఉత్తర ప్రాంతంలో మిలటరీని తొలగించాలని కోరడం తప్పని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News