: కాన్షీరామ్ కు భారతరత్న ప్రకటించాలి: మాయావతి
భారతరత్నను తమ వారికే ఇవ్వాలంటూ పలు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. తాజాగా, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కు భారతరత్న ప్రకటించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం కాన్షీరామ్ ఎంతగానో పాటుపడ్డారని... భారతరత్నకు ఆయన అన్ని విధాలా అర్హులని ఆమె తెలిపారు. ఇదే సమయంలో ఎన్డీయేపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రస్తుతం 'అచ్చే దిన్' అన్నది ప్రజలకు ఓ కలలా మారిపోయిందని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత ఘర్షణలను రెచ్చగొడుతూ కాలం గడుపుతోందని... ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని మండిపడ్డారు.