: స్కేటింగ్ చేస్తూ శబరిమలకు జోగిపేట విద్యార్థి
కాలుష్య నివారణే ధ్యేయంగా జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థి ఎం.రాహుల్ స్కేటింగ్ చేస్తూ శబరిమలకు ప్రయాణం కట్టాడు. ఇతనికి మిత్రులు రాకేష్, సాయిబాబా తోడయ్యారు. ముగ్గురూ కలసి యాత్రకు బయలుదేరారు. గత సంవత్సరం కూడా రాహుల్ ఇలానే స్కేటింగ్ పై శబరి యాత్ర చేశాడట. ఇక్కడి అయ్యప్ప దేవాలయంలో పూజలను నిర్వహించిన అనంతరం బయలుదేరిన రాహుల్ కు స్థానికులు అభినందనలు తెలిపారు. స్కేటింగ్ పై దూరప్రాంతాలకు వెళ్ళడం ఎంతో ఆనందాన్ని, అనుభవాలనూ అందిస్తుందని రాహుల్ వివరించాడు.